1.దేశజనాభాలో,
యువతశాతం అధికం!
దేశప్రగతిలో వారి పాత్రే,
అత్యంత కీలకం!
వారి చేతుల్లో, చేతల్లో,
దేశ భద్రత,బాధ్యత పదిలం!
పిల్లలు ఎదగవలిసిన వాళ్ళు,
పెద్దలు అలిసిఉన్నవాళ్ళు! యువతీయువకులు ఏపనైనా,
అందుకునే స్వచ్ఛందసేవకులు!
యువశక్తి నిబిడీకృతమై ఉన్న,
అఖండ అణుశక్తి!
వారి ఆసక్తే ప్రగతి రథాన్ని,
నడిపే చోదకశక్తి!
వారి దేశదైవభక్తి ఈ దేశానికి,
తరగని సంపత్తి!
తోకముడుస్తుంది ఎదురయ్యే,
ప్రతి ఆపత్తి!
నిలుస్తుంది విశ్వమంతా,
భరతమాత ఘనకీర్తి!
2.సరిలక్ష్యనిర్ణయం,
జీవనానికి దిక్సూచి!
మనిషి అలుపెరుగని,
ప్రయత్నంతో నవ్యసవ్యసాచి!
లక్ష్యం చేరేదాక,
ఆగనివాడే వివేకానందుడు!
ఏకాగ్రత ఎట్టి పరిస్థితుల్లోనూ,
చెదరనివాడు ఏకలవ్యుడు!
సైన్యం, మన్యం,
శాస్త్రం,సాంకేతికం!
సాహిత్యం, సమసమాజం,
ఆశావాదం, అభ్యుదయం!
రంగమేదయినా యువత,
దూసుకు పోతుంది!
వారి దృష్టి ఐకమత్యం,
వారి సృష్టి ఐశ్వర్యం!
ముడి వస్తువుకు,
ముచ్చటైనరూపం వారిప్రజ్ఞ!
చిక్కు ముడులు,
విడదీయడం వారి ప్రతిజ్ఞ!
3.గత ఒలింపిక్స్ లో,
వారి ప్రదర్శన గర్వకారణం!
దేశరక్షణలో వారి త్యాగాలు,
చిరకాల ఉదాహరణం!
రాబోయే తరాలకు,
వారు సూత్రధారులు!
బాలచంద్రులు, అభిమన్యులు,
మాంచాలలు,కన్యకలు!
ఈ దేశం రత్నగర్భే కాదు,
ఘనయువతకు స్వర్ణగర్భ!
యువతశాతం అధికం!
దేశప్రగతిలో వారి పాత్రే,
అత్యంత కీలకం!
వారి చేతుల్లో, చేతల్లో,
దేశ భద్రత,బాధ్యత పదిలం!
పిల్లలు ఎదగవలిసిన వాళ్ళు,
పెద్దలు అలిసిఉన్నవాళ్ళు! యువతీయువకులు ఏపనైనా,
అందుకునే స్వచ్ఛందసేవకులు!
యువశక్తి నిబిడీకృతమై ఉన్న,
అఖండ అణుశక్తి!
వారి ఆసక్తే ప్రగతి రథాన్ని,
నడిపే చోదకశక్తి!
వారి దేశదైవభక్తి ఈ దేశానికి,
తరగని సంపత్తి!
తోకముడుస్తుంది ఎదురయ్యే,
ప్రతి ఆపత్తి!
నిలుస్తుంది విశ్వమంతా,
భరతమాత ఘనకీర్తి!
2.సరిలక్ష్యనిర్ణయం,
జీవనానికి దిక్సూచి!
మనిషి అలుపెరుగని,
ప్రయత్నంతో నవ్యసవ్యసాచి!
లక్ష్యం చేరేదాక,
ఆగనివాడే వివేకానందుడు!
ఏకాగ్రత ఎట్టి పరిస్థితుల్లోనూ,
చెదరనివాడు ఏకలవ్యుడు!
సైన్యం, మన్యం,
శాస్త్రం,సాంకేతికం!
సాహిత్యం, సమసమాజం,
ఆశావాదం, అభ్యుదయం!
రంగమేదయినా యువత,
దూసుకు పోతుంది!
వారి దృష్టి ఐకమత్యం,
వారి సృష్టి ఐశ్వర్యం!
ముడి వస్తువుకు,
ముచ్చటైనరూపం వారిప్రజ్ఞ!
చిక్కు ముడులు,
విడదీయడం వారి ప్రతిజ్ఞ!
3.గత ఒలింపిక్స్ లో,
వారి ప్రదర్శన గర్వకారణం!
దేశరక్షణలో వారి త్యాగాలు,
చిరకాల ఉదాహరణం!
రాబోయే తరాలకు,
వారు సూత్రధారులు!
బాలచంద్రులు, అభిమన్యులు,
మాంచాలలు,కన్యకలు!
ఈ దేశం రత్నగర్భే కాదు,
ఘనయువతకు స్వర్ణగర్భ!
f youth power
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి