కార్తీకమాసంలో సముద్ర స్నానం.తాటి కోల పద్మావతి గుంటూరు.

 వైశాఖ, ఆషాడ, కార్తీక ఇక మార్గశిర మాసాల్లో అందరూ సముద్ర స్నానం చేయాలని పెద్దలు నిర్దేశించారు. ఆశ్వీయుజ, కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమ లో ప్రతి హిందువు తప్పక సముద్ర స్నానం చేయాలి. ఉప్పు నీటి స్నానం వల్ల శరీర వ్యాధులు నశిస్తాయి. శరీర కాంతి పెరుగుతుంది. శ్వాస కోశ వ్యాధులు నశిస్తాయి. బ్రహ్మపుత్రా నది తప్ప తక్కిన పుష్కర జీవనదులు భారతదేశంలో సముద్రంలో కలుస్తాయి. సముద్ర స్నానం వల్ల ఆ పవిత్ర నదుల్లో స్నానం చేస్తే వచ్చే పుణ్యం ఒక చోట లభిస్తుంది. జాతకరీత్యా జరుగుతున్న అష్టమ శని, ఏలినాటి శని కంటక శని దోషాలు సముద్ర స్నానం వల్ల బాధించవు. సముద్రస్నానం తరం వెనుకకు తిరిగి మూడు సార్లు ఇసుక సముద్రంలోనికి విసరాలి. సముద్రుని మా ఊరికి రావద్దు అనే భావనతో. మహాలక్ష్మి పుట్టింది సముద్రంలో. ఎన్నో రత్నాలకు, ముత్యాలకు సముద్రం పుట్టినిల్లు. అందుకే సముద్రానికి రత్నగర్భ అని పేరు. భూమిపై ఉండే సకల జీవరాసులు సముద్రగర్భంలో ఉన్నాయి సముద్ర స్నానం చాలా గొప్పది. కార్తీకమాసంలో సముద్ర స్నానం ఎంతో పుణ్య ఫలాన్నిస్తుంది.
కామెంట్‌లు