నా ప్రమేయం లేకుండానే చేరావు మనసు గదిలోకినేనంటూ నాకే ఉనికి లేనంతగానిండిపోయావుఎడారంటి నా హృదయంలో ప్రేమ బీజం వేసిజీవితాన్ని ఇంద్రధనుస్సులారంగుల మయం చేసిగగన వీధిలో మబ్బుల పల్లకి లో ఊరేగించావునా శ్వాసకు ఊపిరి దీపం నువ్వు కదానా ప్రాణానికి ప్రాణం నీవే కదాకాలం కౌగిలిలో గడిచినప్రతి క్షణం మధురాతి మధురంమనం గడిపిన ఏకాంతాలునిత్య నూతనమైరస సామ్రాజ్యానికి నన్నో రాణిని చేసాయేనా మది నిండా నీ వూసులేకనులు మూసినా తెరిచినా నీ రూప సౌందర్యమేనన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయిఏ గాలి గంధాలో నా మేనిని తాకుతుంటేనీ మునివేళ్లతో తనువును మీటినట్లుగావిరహపు తపనలుప్రేమంటే ఇరు హృదయ సంగమంప్రేమంటే మాటల శరాలతోముక్కల య్యే బంధం కాదుప్రేమంటే ఇరు తనువులు జాతరలో ఓడి గెలవడమే కాదుమూడు ముళ్ళతో వేసిన బ్రహ్మ ముడిఏమూన్నాళ్ళ ముచ్చట కాదు రాజానా ప్రేమలో దోషమానా ఆరాధనలో లోపమానా ఆకాంక్షలో అలుసానా నమ్మకం లో నీవాడేది నాటకమాఅహంకారపు కారు మేఘాలు నీ మనసును ముసిరాయావేదమంత్రాల సాక్షిగా చేసిన బాసలు అడియాశలు కావాలామనం అనుకున్న అనురాగ క్షణాలువిషం అయ్యాయాప్రేమను కురిపించాల్సిన ఆ కనులుద్వేషాన్ని పులుముకుని
: దీపావళి;-సర్వస్- కలం స్నేహం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి