అమ్మ కుట్టిన టోపి! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివ తండ్రి లేని పిల్లాడు. వాడికి ఇవాళ  పదేళ్ళు వస్తాయి.అందుకే అమ్మ తను బట్టలు కుట్టే షాపులో ని రకరకాల గుడ్డపీలికలతో ఒక అందమైన టోపి కుట్టింది.అమ్మ చేసిన  పాయసంతిని ఆటోపీ పెట్టుకుని అందరికీ చూపాలని బయలుదేరాడు.దారిలో బండి తోలే వాడు కనపడి"నీటోపి బాగుంది బాబు.నాకొడుకు కి ఇస్తావా?నీవుఎప్పుడుకావాలంటే అప్పుడు  నాబండీఎక్కవఛ్చు" అని అడిగాడు. "ఉహు!నేను ఎంత దూరం ఐనా నడవగలను.అమ్మ కుట్టిన టోపి ఇవ్వను"అని నడవసాగాడు.ఊరిచివర ఆపెద్ద భవంతిలోంచి ఓ అమ్మాయి బైటికి వచ్చింది.ఆమె నగరంలో అమ్మ నాన్న ల దగ్గర ఉంది. అమ్మ మ్మ తాతలను చూడటం కోసం  తొమ్మిదో తరగతి చదువుతున్న ఆమె వచ్చింది."ఏయ్!బాబూ!ఇలారా"ఆమె పిలుపుతో దగ్గరకు వచ్చిన  శివ ని"ఆటోపీని నాకు ఇస్తావా?నీవు అడిగినంత డబ్బు ఇస్తా ను"అంది ఆమె."ఉహు!ఇది మాఅమ్మ నాకోసం కష్టపడి కుట్టింది. "ఇంతలో ఆమె తాతబైటికి వచ్చి శివను పలకరించాడు.వాడి వివరాలు అడిగాడు. రెండు ఏళ్ళ క్రితం తన దగ్గర పనిచేసిన రాముడి కోడుకు అని తెలుసు కున్నాడు.కరోనా కాటుతో తండ్రి చనిపోతే  శివ తల్లి  వాడు ఎలా బతుకు ఈడుస్తున్నారో తెలుసు కున్నాడు."శివా!నీవు  మీఅమ్మ మాతో పట్నం కి వచ్చి ఉండండి. అక్కడే నీవు చదువుకుందువుగానీ"అమ్మాయి రాణి అంది.తాత ఆలోచన లో పడ్డాడు. తను భార్య  కొడుకు దగ్గర ఏడాది పైగా ఉన్నారు. స్వేచ్ఛగా బతికిన తాము అక్కడ పంజరంలో పిట్టలులాగా బతుకు ఈడుస్తున్నారు.కూతురు విదేశంలో ఉంది. అక్కడికి రమ్మని రోజూ ఫోన్ చేస్తుంది. ఈవయసులో అక్కడ కి వెళ్లటం ఇష్టం లేదు. శివ వాడితల్లికి ఇక్కడ తమభవంతిలో వసతికలిపించి   
తను భార్య ప్రశాంతంగా ఉండవచ్చు అని తాత ఆలోచన. "శివా!మీఅమ్మని  పిల్చుకునిరా!" ఇంతలో ఆయన భార్య కూడా బైటికి వచ్చింది.వాడిచేతిలో  ఓపదిరూపాయలు పెట్టబోతున్న ఆమెతో"అవ్వ గారు!ఎవరిదగ్గరా ఉచితంగా ఏదీ తీసుకోకూడదు అని మాఅమ్మ చెప్పింది'"శివా మాటలకు ముచ్చట పడ్డారు ఆదంపతులు."నా తమ్ముడి కి నీటోపి ఇవ్వు. తాతా!వాడి కో వందరూపాయలు ఇవ్వండి " శివ తల అడ్డంగా ఊపుతూ "ఉహు!మాఅమ్మ కుట్టిన టోపీని బంగారం ఇచ్చినా ఇవ్వను."మొండిగా కళ్ళవెంబడి నీరు కారుతుంటే అన్న శివ మాటలకు వృద్ధుల గుండె కరిగినీరైంది.ఇలాంటి వారికి తన ధనం సద్వినియోగం చేయాలనుకున్న తాత  మనవరాలితోకలిసి శివా ఇంటి కి వెళ్ళి వాడితల్లికి భరోసా ఇచ్చాడు"అమ్మా సీతా!నీవు మాఇంట్లో  పిల్లలాగాపెరిగావు.నీపెళ్లికూడా నేనే చేశాను. నీవు  శివా తో వచ్చి  మా  ఇంట్లో నే ఉండు.మేము వృద్దదంపతులం ఇక్కడే తనువు చాలిస్తాం! "ఆయన మాటలతో ఆమె ఆయనపాదాలకి నమస్కరించి   తల ఊపింది.అమ్మ కుట్టిన టోపి ఎంతవిలువైనదో కదా?
కామెంట్‌లు