కడుపులో వేదన రాగాలు....
కరిగిపోని కాగడ రుజువులు....
పేదరికపు ఆకలి అరుపులు....
దాగలేని దగాలకు సాక్షాలు.....
వేదన ఆవేదనల సంగమాలు....
నిక్క పొడిచే అవిటి తనాలు....
విరుగుడు లేని ఈ వెతలు.....
మదిని మధించే సాగరాలు....
స్వార్థపు విషం పుసుకుంది లోకం....
కనపడని చీకటి బతుకులు ఎన్నో....
పేదరికపు ఆర్తనాదాలు వినని చెవులు ఎన్నో...
మారని తీరుకు ఎదురుచూపులు ఎన్నో.....
ఓర్పు ఓటమిపాలు....
మానవత్వం మరుగున నలుగు...
అణిగిపోతున్న అరవనీయని కాలం....
బలి పశువులు ఎండిన ఈ డొక్కలు.....
ఆగని పేదరికపు కన్నీళ్లు....
ఆగని బలాల బలగాలు....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి