చలికాలం వచ్చిందీ
గజగజలే తెచ్చిందీ
చలిమంటలు వేయించిందీ
చలిరగ్గును కప్పించిందీ
ఊలుస్వెటర్లు తొడిగించిందీ
రాత్రిసమయం పెంచిందీ
పగటిసమయం తగ్గించిందీ
మామిడిచెట్లన్నీ పూయించిందీ
చింతచెట్లన్నీ కాయించిందీ
క్రిస్మస్ పండుగ తెచ్చిందీ
సంక్రాంతిపండుగ తెచ్చిందీ
రంగులసింగిడి ముంగిటవచ్చే
ముత్యాలముగ్గులు తెచ్చిందీ
రంగురంగుల హరివిల్లుల్లాగా
గాలిపటాలు ఎగరేయించిందీ
జనాలుఅందరు సుఖపడేలా
పంటలుఇంటికి తెచ్చిందీ
అందుకె అందుకె చలికీ జై!!
*చలికీ జై!* (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి