గీతాంజలి ; -రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 8. అలంకరణ బంధపు ఆటంకం .....
అలంకరణలపేరిట మానవుడు తనకు తానుగా జీవిత స్వేచ్ఛకు అడ్డంకులు కల్పించుకుంటాడనే మెళకువను ఈ ఖండిక మనకందిస్తుంది. 
ఒంటినిండా అలంకారాలు చేసుకున్న పసివాణ్ణి అతడి ఆభరణాలు నలిగి పోతాయని, అతడి బంగారు జలతారు పొదిగిన వస్త్రాలు మాసిపోతాయనే భయంతో అతడ్ని కాలు క్రింద పెట్టనీయకుండా పెద్దలు చూస్తుంటారు. ఇందువల్ల అతనికి ప్రకృతి సిద్ధంగా లభించే గాలి, వెలుతురుల హాయితోపాటు ప్రకృతి యిచ్చే ఆహారపు ఆరోగ్యంకూడ అందదనీ,భూమాత ఒడిని తాకడం వల్లనే జీవిత ఉత్సవ విలువ తెలుస్తుందనీ, పెద్దలు పెట్టే ప్రతిబంధకాల వల్ల ఆబాలుడు జీవిత ఉత్సవ ఆనందానికి దూరమైనట్లు భావించవలసి వస్తుంది. అసహజమైన కొన్ని కోరికలు భగవంతుడు ప్రసాదించే సహజ ఆనందానికి దూరం చేస్తుంటాయి సుమా....

కామెంట్‌లు