ఇష్టం....!!(మాటలు...ఆన్షి, రాతలు....కెఎల్వీ)

 ఇష్టం..ఇష్టం..
భలే..భలే..ఇష్టం 
బయటకు వెళ్లడం 
అంటే---
నాకెంతో ఇష్టం....!
అమ్మా-నాన్న తో
కారులో---
షికారుకెల్లడం...
ఇష్టం.....!
చల్లచల్లగా..
బయటిపార్లర్లో
ఐస్ క్రీం తినడం
చాలా..చాలా ఇష్టం!
బయటిగాలిలో
రద్దీతగ్గినరోడ్డుమీద
స్వేచ్ఛ గాతిరగడం
చెప్పలేనంత ఇష్టం!
అడిగిన వెంటనే 
కాదనకుండా ....
బయటకుతీసుకెల్లే
మమ్మీ..డాడీ అంటే
మరీ..మరీ..ఇష్టం!!

కామెంట్‌లు