బాలల దినోత్సవం లో ప్రసంగించిన ప్రముఖ రచయిత డాక్టర్ చిటికెన

 సిరిసిల్ల పట్టణంలోని స్థానిక వేదవ్యాస ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో శనివారం బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పరిపాలన కార్యక్రమం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల ఆటలు పాటలతో జరిగినాయి.  ఇట్టి కార్యక్రమంలో విద్యాసంస్థ ప్రిన్సిపాల్  పోనిశెట్టి అశోక్, ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త, ఐ. బి. ఆర్ ఏఫ్ సభ్యులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్  పిల్లలకు  మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిటికెన మాట్లాడుతూ చాచా నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టం అని అందుకే తన జయంతి బాలల దినోత్సవం గా జరుపుకుంటారని తెలియజేశారు 
ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ కళా అశోక్ నక్క( లంబోదర ఆర్ట్స్ అకాడమీ),వేద వ్యాస పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌లు