1
ఓమారు శ్రీ రామకృష్ణ పరమహంస నరేంద్ర ( వివేకానంద) ను పిలిచి ఇప్పటివరకూ కఠోర ధ్యానంతో పొందిన ఆత్మశక్తినంతటినీ నీకు ఇచ్చెయ్యాలనుకుంటున్నానని చెప్పారు.
అయితే నరేంద్రులవారు "అలాగా! ఈ శక్తినంతటినీ పొందితే దేవుడిని తెలుసుకోవాలనుకున్న నా ఆరాటానికి దోహదపడుతుందా?" అని ప్రశ్నించారు.
పరమహంస నవ్వుతూ "ఆ శక్తితో భగవంతుడిని తెలుసుకోవడం సాధ్యం కాదు. కానీ నువ్వు ఇతరులకు గురువుగా ఉండేందుకు దోహదపడుతుంది" అన్నారు.
వెంటనే నరేందర్ "అయ్యా! అటువంటిది ఇప్పుడు నాకక్కర్లేదు. అసలు దేవుడెవరు అని తెలుసుకోవాలన్నదే నా తొలి తపన. దేవుడిని తెలుసుకున్నాక ఈ శక్తులు అవసరముంటుందా అని తెలుస్తుంది. పైగా ఇప్పుడీ శక్తులను పొందితే నా అన్వేషణను మరచిపోయి నా స్వార్థం కోసం ఉపయోగించుకుంటానేమో" అంటూ ఇప్పుడీ శక్తులేవీ తనకక్కర్లేదని నిరాకరించారు.
2
ఓమారు స్వామి అఖండానందతో కలిసి హిమాలయ పర్వత శ్రేణి దిగువన నడుచుకుంటూ పోతున్నారు స్వామి వివేకానంద.
బహుదూరం నడచిన అలసట ఆయనను ఇబ్బందిపెట్టింది.
ఆకలి విపరీతంగా ఉంది.
రోడ్డు పక్కన సొమ్మసిల్లి పడిపోయారు. ఆ ప్రాంత ప్రతినిధి సుల్ఫికర్ అలీ, స్వామీ వివేకానంద కింద పడిపోవటాన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు. కాస్సేపటికి వివేకానందులవారు కళ్ళు తెరచి చూశారు.
అలీ తన దగ్గరున్న కీరాను వివేకానంద చేతిలో పెట్టారు.
అయితే వివేకానందులవారు తినిపించమని అడిగారు.
కానీ అలీ ఒకింత ఆలోచించారు.
అయితే వివేకానందులవారి పరిస్థితిని గ్రహించిన అలీ తానే తినిపించారు.
కాస్తంత ఓపిక రావడంతోనే స్వామీజీ "తినిపించడానికి ఎందుకు ఆలోచించారు?" అని అడిగారు.
"ఏమీలేదు. మీరు హిందూ సాధువు. నేనేమో....." అని అలీ అంటుండగానే వివేకానందులవారు "అలా అనుకోకండి. మనమందరం సోదరులం" అని అలీకి కృతజ్ఞతలు చెప్పి ముందుకు సాగారు.
3
కొన్నేళ్ళ తర్వాత వివేకానంద అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరీగొచ్చారు. అప్పుడు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఊరేగింపులో పాల్గొన్న వివేకానందులవారు జనం మధ్యలో ఉన్న అలీని గుర్తుపట్టారు.
అలీని దగ్గరకు పిలిచి "ఈయనే నా ప్రాణం కాపాడారు" అని వివేకానంద ఆయన గురించి గొప్పగా మాట్లాడారు.
4
స్వామి వివేకానందులవారి ప్రసంగాలెంత దివ్యంగా ఉంటాయో యావత్ ప్రపంచానికీ తెలుసు. కానీ ఆయన ఒక సగటు విద్యార్థే.
విశ్వవిద్యాలయ ప్రవేశ స్థాయి పరీక్షలో ఆయన పొందిన మార్కులు 47 శాతం మాత్రమే. ఎఫ్.ఎ. లో 46 శాతం మార్కులు, బి.ఎ. లో 56 శాతం మార్కులు పాందారు.
డిగ్రీ సంపాదించిన తర్వాత ఉద్యోగాన్వే షణలో పడ్డారు. భగవంతుడిపై నమ్మకంలో కించిత్ "తడబాటు" ఏర్పడటంతో ఆయన ఓ దశలో నాస్తికుడిగా మారిపోవాలనుకున్న క్షణాలున్నాయి. అయితే అటువంటిది జరగలేదు.
5
స్వామి వివేకానందకు టీ ప్రియులు. ఆరోజుల్లో టీ తాగడాన్ని వ్యతిరేకించారు కొందరు పండితులు. కానీ స్వామీజీ తమ మఠంలో టీ తాగే అలవాటుని ప్రవేశపెట్టారు.
బేలూరు మఠంలో ఓమారు టీ తయారు చేయమని బాలగంగాధర్ తిలక్ ని ఒత్తిడి చేశారు స్వామీజీ. స్వాతంత్ర్య సమరయోధుడైన తిలక్ ఏలక్కాయి, జాపత్రి, కుంకుమపువ్వు వంటివన్నీ తీసుకొచ్చి మొగలాయ్ పద్ధతిలో టీ తయారుచేసిచ్చారు స్వామీజీతోపాటు ఇతరులకు.
6
పిరికివారితోనో లేక అర్థరహిత రాజకీయాలతోనో తనకెలాంటి సంబంధాలు ఉండవనీ చెప్పారు స్వామీజీ
"భగవంతుడూ, సత్యమూ ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక రాజకీయం. అదే నాకిష్టం. మిగిలినవన్నీ వొట్టి చెత్తకుప్పే" అన్నారాయన.
ఓరోజు ఆయన మామూలుగా చేతులు కట్టుకుని గంభీరంగా నిల్చోడాన్ని ఓ ఫోటోగ్రాఫర్ చూసి వెంటనే ఫోటో తీశారు. ఆ ఫోటోని చికాగోలోని కోస్లితో గ్రాఫిక్ కంపెనీ పోస్టరుగా ముద్రించి నగరమంతటా ప్రదర్శించింది. ఆ ఫోటోనే ఈరోజు వరకూ వివేకానందులవారి గాంభీర్యాన్ని మన కళ్ళముందు ప్రత్యక్షమయ్యేలా చేస్తోంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి