గీతాంజలి రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 11. “శ్రమైక జీవన సౌందర్య నివాసి "
“శ్రమ శక్తి" అనే కర్మయోగ సౌందర్యంలో వుండటానికి భగవంతుడు ఇష్టపడతాడని చెప్తూనే, నువ్వు చెమటోడ్చి నీ కృషి ఫలించేందుకు చేసే కృషితో సర్వేశ్వరునికి అండగా నిలబడవలసిందంటూ దేవుడు, జీవుడు మధ్య అవసరమైన బాంధవ్య ప్రాధాన్యతను కవి చెప్తున్నాడు.
పూజాదికాలతో భగవంతుణ్ణి కొలుస్తున్న పూజారీ, దేవాలయ చీకట్లో ఎవరికోసం నువ్వు పూజ చేస్తున్నావు? నువ్వు ఎవరికోసం పూజాదికాలు చేస్తున్నావో ఆ ఈశ్వరుడు ఇక్కడ లేడు. నువ్వు కళ్ళు తెరిచి చూస్తే కఠినమైన నేలను దున్నే రైతు ఉన్నచోట, పదిమంది సులభంగా నడవటానికి వీలైన రహదారిని నిర్మించటానికి కూలీలు రాళ్ళు పగలగొట్టే చోట ఉంటాడు.

కామెంట్‌లు