కాలినడక రోజులు పోయి
గాలి మోటారెక్కె రోజులొచ్చె
బండి ఎక్కే రోజులు పోయి
బస్సు లెక్కే రోజులు వచ్చె
చేద బావలు కనుమరుగై
చేతిపంపులు వచ్చి చేరె
మోట భావులు కనుమరుగై
బోరుబావులు వచ్చి చేరె
జోడేడ్ల నాగలి పోయి
నాలుగు చక్రాల ట్రాక్టరొచ్చె
సవారు కచ్చురాలు పోయి
మూడు చక్రాల ఆటోలొచ్చె
సైకిల్ తొక్కే రోజులు పోయి
సైకిల్ మోటార్ ఎక్కే రోజులొచ్చె
పూర్వకాలము సంగతులు
నేటి కాలము పిల్లల కొరకు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి