కేదారిగౌరమ్మ మంగళహారతి;-"రసస్రవంతి" & " కావ్యసుధ "
మంగళం శివునంత రంగమందిరమందు విలసిల్లు
మా తల్లి గౌరమ్మకు
మంగళం మహదేవు నర్ధభాగము నందు శోభిల్లు
కేదారి గౌరమ్మ
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం జయా జయ మంగళం

కాంతులను వెదజల్లుతు కనకరత్నపు చీర
కట్టి కూర్చున్నట్టి కమలాక్షికి
జలతారు పట్టంచు బట్ట రవికెను దొడిగి
కర కంకణాలున్న కామాక్షికి

జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం జయా జయ మంగళం

నొసటి కుంకుమబొట్టు మెరుపు మిసమిసలాడ
ముసి నవ్వు లేదజల్లు మరుమల్లికి
ముత్యాల ముక్కెరతో చెక్కిల్ల నిగనిగలు
చెమ్మ చెక్కాడేటి చెంగల్వకు

జయ మంగళం జయా జయ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం

పలు పక్వముల జేసి , గంధమక్షిత  - లేసి
పూల పూజల నందు పూబోనికి
పసుపు కుంకుమ లేసి అగరు ధూపం వేసి
కర్పూర హారతులు కళ్యాణికి

జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం జయా జయ మంగళం

ఆయురారోగ్యాలు,  ఐశ్వర్యముల నిచ్చు
అఖిల లోకాలేలు చున్నమ్మకు
ఆనంద మకరందముల చిందించుచున్ననట్టి
అందాల కేదారి గౌరమ్మకు

🕉️జయ మంగళం జయా జయ మంగళం
జయ మంగళం జయ శుభ మంగళం 🕉️

కామెంట్‌లు