యోగా కాదు...!!(మాటలు..ఆన్షి, రాతలు...కెఎల్వీ)

 మిద్దెమీద ఆటలకు
మనసునిండా ఆరాటం
సాయంత్రం అయిన్దా
అక్కడకి పరుగో..పరుగు!
రెండు మూడుచుట్లు 
నడకతో తిరిగాక....
దాగుడు మూతల ఆట
మొదలు.....
అది బోరుకొట్టాక
కప్పగంతుల ఆట  !
తాత అరుపులు మొదలైతే
పరిగెట్టక తప్పదుమరి...
ఆ..తదుపరి--
రకరకాల విన్యాసాలతో
చీకటి ఉదయిస్తుంది...!
స్నానానికి రమ్మని...
కమ్మని అమ్మ పిలుపు...
మిద్దె మీదిఆటలకు...
ముగింపు పలుకుతుంది!!
కామెంట్‌లు