సు (నంద) భాషితం;- *సునంద వురిమళ్ల, ఖమ్మం*
 *ధనం మూలం ఇదం జగత్*
*****************
*ఈ ప్రపంచం అంతా ధనం చుట్టూ తిరుగుతుందనీ, డబ్బే ప్రపంచాన్ని శాసిస్తున్నదనే ఉద్దేశంతో ఈ మాట వాడతారు.*
*కానీ డబ్బుతోనే  అన్ని సుఖాలు, సంతోషాలు చేకూరుతాయనుకోవడం ఒట్టి భ్రమ మాత్రమే.*
*పరిమిత ధన సంపాదనతో ఇంటిల్లిపాదీ ఆనందంగా గడిపే కుటుంబాలు చాలా ఉన్నాయి.*
*డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న వారికి ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు.*
*బంధాలు అనుబంధాలకు,పరోపకారతకు ప్రాధాన్యత ఇస్తూ ధర్మబద్ధంగా  నీతీ నిజాయితీగా సంపాదించే*ధనం అంతులేని తృప్తినీ, అపరిమిత ఆనందాన్నీ ఇస్తుంది*
 *సుప్రభాత కిరణాల నమస్సులతో 🙏*

కామెంట్‌లు