అమ్మ ది హన్మకొండ
ఉద్యోగం హన్మకొండ !
నాన్న ది హైదరాబాద్ ,
ఉద్యోగం హైదరాబాద్ !
నేనిప్పుడు హన్మకొండ
చదువు కూడ హన్మకొండ!
అమ్మ కు బదిలీ అయితే
నేనూ హైదరాబాదే.......!
ఇప్పుడైతే.....
అన్న కోసం-చెల్లికోసం
పెద్దమ్మకోసం.....
పెదనాన్న కోసం...
(హై)తాతకోసం......
హైదరాబాద్ వెళ్ళాలి!
ఆతర్వాత...
అప్పుడప్పుడు
హన్మకొండ రావాలి
తాతకోసం
అమ్మమ్మ కోసం...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి