ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం

 తొట్టంబేడు:మండలం లో పెన్నలపాడు
ప్రాధమిక పాఠశాలలో ఘనంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. విద్యార్థులు తెలుగు తల్లి మరియు పొట్టిశ్రీరాములు
వేషధారణల తో అలరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు
కయ్యూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ విద్యార్థులలో బాల్యం 
నుండే దేశ నాయకుల పట్ల అవగాహన
చేస్తూ దేశ భక్తిని కలగించాలన్నారు.
రాష్ట్ర విభజన జరిగినా తెలుగు వారందరు సమిష్టిగా తెలుగు భాషా
పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఈ
కార్యక్రమం లో పాఠశాల విద్యార్థులు,
ప్రధానోపాధ్యాయులు బాలసుబ్రమణ్యం
సహోపాధ్యాయుడు దినకర్ , గ్రామస్తులు పాల్గొన్నారు.

కామెంట్‌లు