మహానటి సావిత్రి;-యలమర్తి అనూరాధహైద్రాబాద్చరవాణి:924726౦206
 దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య
కనులతో నవరసాలు ఒలికించిన మహానటి 
ఒకసారి మాట కలిపితే ప్రాణం పెట్టే స్నేహమయి
నీ నా భేదం చూపని అన్నపూర్ణ 
ఎందరో మనసులను దోచుకున్న దొరసాని
ప్రేమను పంచుతూ ప్రేమను పొందాలనుకునే 
ప్రేమ స్వరూపిణి
మానవత్వానికే మారుపేరుగా విరాజిల్లిన విదుషీమణి
దయకే దయగలిగేంత దయాహృదయిని కట్టుకున్నవాడు తనకొక్కరికే సొంతమవ్వాలని భావించిన పతివ్రత
దగా పడిన హృదయాగ్ని ఆర్ప మత్తుకు బానిసైన అర్ధాంగి
తనువును తనంతట తనే దహించుకున్న
ప్రేమ పిపాసి
సినీ వినీలాకాశంలో వెలిగే చందమామ 
చూపుల వెన్నెలతో మురిపించిన ముదిత
ఏ లోకంలో ఉన్నా మనందరి మదిలో ఎన్నటికీ నిలిచే సితార
============================================
చిరునామా:
యలమర్తి అనూరాధ 
బి బ్లాక్ -205
ఎస్ .వి .కె ప్రాజెక్ట్స్
నియర్ చంద్ర గార్డెన్స్ 
గాయత్రీ నగర్
హైదరాబాద్ -18
చరవాణి:9247260206


కామెంట్‌లు
Unknown చెప్పారు…
అనూరాధ గారూ, "మహానటి సావిత్రి" చాలా అద్భుతంగా రాశారు. Keep it up. Prem Chand Gummadi 94918 85789