సప్త దినాధిపతులు:బుధుడు! "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
 👌'సౌమ్యు'డనగా బుధుడు!
     రోహిణీ కుమారుడు!
     శుభముల నొసగు మీకు!
           ఓ తెలుగు బాల!
           ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
🚩బుధుడు.. సప్త దినాధిపతు లలో నాలుగవ వాడు! ఆత్రేయ గోత్రజుడు. మిధున రాశికి, మరియు, కన్యా రాశికి అధిపతి. "బుధ హోర" తో సూర్యోదయము.. ప్రారంభమగు రోజు.. "బుధ వారము". దీనికే "సౌమ్య వాసరము" అని, సంస్కృత నామము!
🙏ధ్యాన శ్లోకము:
ప్రియంగు కళికా శ్యామమ్,
రూపేణ ప్రతిమం బుధమ్!
సౌమ్యం సౌమ్య గుణోపేతం!
తం బుధం ప్రణమామ్యహం!!
👌"బుధుడు" (సర్వము తెలిసిన వాడు),
"సౌమ్యుడు" (చంద్రుని ప్రియ సుతుడు),
"రోహినేయుడు" (రోహిణీ దేవి కుమారుడు); 
....మున్నగునవి., బుధునకు పేరులు.
  🙏ప్రార్ధనా పద్యము
       (ఉత్పల మాల)
      శ్రీమ న్మంజుల సౌమ్యవాసర విభున్, సింహేంద్ర వాహున్, మహా
       సోమ ప్రోద్భవు సౌమ్యు, పుస్తక కరున్, శుద్ధాoతరంగున్, విభున్,
         ధీమంతున్, విలసత్ చతుర్భుజు, మహా దివ్యాశ్వ సుస్యoదనున్,
        కామ క్రోధ హరున్, బుధున్, బహు నమస్కారంబు లన్ కొల్చెదన్!
( 'ఆర్షకవి శిరోమణి' విద్వాన్ బులుసు వేంకటేశ్వరులు., సప్త దినాధిప స్తవము. )

కామెంట్‌లు