*మరో కదనం*;-*సాగర్ రెడ్డి**చెన్నై*
ఉపద్రవాన్ని మరచీ ఉన్నంతలో
జీవితాన్ని నెట్టుకొస్తూ,
ఊపిరి పీల్చుకుంటున్న వేళ,
ఉలిక్కిపడేలా చేసింది 
మానవాళిని కమ్ముకుంటున్న
మరో కరోనా దశ!!

పదులసంఖ్యలో బాధితదేశాలు,
భారతావనికి  కమ్మిన ఆ విషాద 
విలయ వలయాలు.
భయోత్పాతాన్ని తలపించి, లక్షలప్రాణాలు గాలిలో కలసి, లక్షణమైన జీవితాలను 
 అతలాకుతలం చేసిన రెండు దశలు శాంతిస్తున్న వేళ,
మోగుతున్న ప్రమాదఘంటికలు!!

మందులేని వ్యాధి కాదది.
మనిషి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపే హెచ్చరిక అది.
నిబధ్ధతను మించిన మందులేదని పరిస్ధితులు ఘోషిస్తున్నా,
మానవ నిర్లక్ష్యం, పరిస్ధితుల ప్రభావమే మహమ్మారి విలయతాండవానికి 
 అసలైన కారణం!!

ఎన్నో విలయ వలయాలను
దిగ్విజయంగా అధిగమించిన
మానవాళికి ఇది ఆ విధాత 
పెట్టిన మరో విషమ పరీక్ష.
వ్యాక్సిన్ వ్యామోహాన్ని సడలించి,
నిబద్దతా మంత్రాన్ని పఠించి,
సాగిపోవడమే మనిషి కర్తవ్యం,
అది మానవజాతి మనుగడకు మరోమార్గం!!


కామెంట్‌లు