నువ్వొచ్చాకే నా చిరునవ్వుకు
మెరుగు దిద్దుకుంది బంగారం
నీలో సగమైన ఈ మనసు శిశువల్లే పసివాడని.
తలపుల భావాలు మరెన్నో
ఎంతటి చింతనైనా మరపించే
నీ కవి విరచితము వినసొంపుగా.
నీ మాటలు మధురాతి మధురం..
సరయు కొలను హద్దుగా
నీ విలువల సమయానుకూలతను ప్రకాశింపచేస్తూ.
నా మనసున సంతోషాలు
కలువల సందేసాత్మకమై..
కో కొల్లలుగా వెల్లువిరిసిన
అక్షరకుసుమాలే..
నువ్వొచ్చాక నీ స్ఫూర్తితో
నీ ఆర్తి ఆదర్శాలకు..
నా ఆలంబనా ఆకాంక్షల
ఇదిగో నా పారితోషకం అందుకో బంగారం..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి