జడకు పువ్వులు అందం
మెడకు మాలలు అందం
యేటికి అలలు అందం
నదికి తీరము అందం
పాటకు పల్లవి అందం
ఆటకు చిందులు అందం
ఇంటికి ఇల్లాలు అందం
ఇడుపుకు దీపం అందం
గుడికి గంటలు అందం
బడికి పిల్లలు అందం
పిల్లలకు చదువు అందం
సంస్కారం మనిషికి అందం
వూరికి ద్వారం అందం
వీధికి శుభ్రత అంతం
నుదుట బొట్టు అందం
కంటికి కాటుక అందం
మోముకు నవ్వు అందం
ఆడపిల్లకు అనుకువ అందం
చెక్కిళ్లకు సిగ్గు అందం
కాళ్లకు కడియాలు అందం
చేతికి గాజులు అందం
పెదవికి ఎరుపు అందం
పసిబుగ్గల నల్లచుక్క అందం
బోసినవ్వుల పాపాయి అందం
అరవిరిసిన పువ్వులు అందం
చిగురేసిన కొమ్మలు అందం
పల్లెకి పచ్చదనం అందం
మగువకు సౌభాగ్యం అందం
సడిలేని నడిిరేయి అందం
వడిలేని చినుకులు అందం
పున్నమి వెన్నెల అందం
నల్లమబ్బుల వెలుగు అందం
కథకు కారణం అందం
బాటకు తనువులు అందం
పంటికి తెలుపు అందం
ఒంటికి శుద్ధి అందం
కవితకు ప్రాస అందం
జలము యేటికి అందం
నదికి వంపులు అందం
వలపు వయస్సుకు అందం
గోరెంట అరచెయ్యికి అందం
వాగేంట వాలుగ అందం
బయలుకు పచ్చిక అందం
అడవికి పర్వతం అందం
ఆటవిక వనములు అందం
అమ్మాయి నడకలు అందం
భూమికి పైరులు అందం
పాటకి సంగీతం అందం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి