ఆకూ - నదీ;-- జయా
రాలిన ఆకు
నదీజలంతో మాట్లాడుతోంది
సవ్వడి రూపాన

నీటి మనసంతా
అర్థం చేసుకున్నాక
పరిపూర్ణ మౌనంతో
ఉండిపోతుంది ఆకు

అవును
అంతా అర్థమైందంటూ
ఒకే ఒక్క వలయంలోకి
ఆకుని తనతో కలుపుకుని
మనిద్దరం ఒక్కటే ఇక
అంటుంది జవాబుగా 
నదీతల్లి!!



కామెంట్‌లు