*** 45 ***
డబ్బు, ఆస్తి... మనహక్కే కావచ్చు.... అవి పోయినా... మళ్ళీ సంపాదించుకునే అవకాశం ఉంటుంది ! గానీ ఆరోగ్యం.... ప్రాణమే పొతే
తిరిగి తెచ్చుకోగలమా... !!
ఇదేమాట మా చిన్నచెల్లి భర్త
శంకరరావు తో చాలాసార్లు చెప్పాను ప్రయోజనం లేకపో యింది !
మా అమ్మ, అన్నయ్య ఆస్తి విషయంలో... అన్యాయం చేస్తున్నారు... నాభార్యా, పిల్లల పరిస్థితి ఏమిటో... అని ఎప్పుడూ ఆందోళన పడుతుం డేవాడు... !
ఓ రోజు బరంపురం నుండి ఫోన్ ! అతను హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని !!
హుటాహుటిన నేను అమ్మ బయలుదేరి వెళ్లినా... అంత్య క్రియలకి అందలేక పోయాం !
పెద్దచెల్లి, మామయ్య కూడా వచ్చారు.. చిన్న చెల్లి పిల్లలు అక్కడ బరంపురంలో ఉండటం కంటే పార్వతీపురం నాదగ్గరకు తీసుకు పోవటమే బెటర్ అని పించింది... !అక్కడి షాప్ అమ్మేసి, ఇద్దరు పిల్లలతో పార్వతీపురం వచ్చేసింది చెల్లి
అంతకు ముందే వాళ్ళు సంపాదించి పోస్టాఫీసులో పొదుపు చేసినది... షాప్ అమ్మినసొమ్ము మొత్తం పోస్టాఫీసులో ఐదేళ్లకు ఫిక్స్డ్ చేసి వచ్చిన వడ్డీతో ఎవరిమీదా ఆధారపడకుండా వాళ్ళబ్రతుకు వాళ్ళు బ్రతికే ఏర్పాటు చేసాను చెల్లి మాకు దగ్గరలో ఓ ఇల్లు తీసుకుని పిల్లలిద్దరినీ... ఒకడిని మూడు, ఇంకొకడిని ఐదు rcm..ఇంగిలీషు మీడియం లో చేర్పించి తన బ్రతుకు తను బ్రతుకుతోంది !
అప్పటిలో పోస్టాఫీస్ వడ్డీలు చాలా బాగుండేవి ! 5 లక్షలు
ఐదేళ్లకు డిపాజిట్ చేస్తే... నెలకు ఐదు వేలు వడ్డీ ఇస్తూ ఐదేళ్ల కాలపరిమితీ అయిపోతే
5 లక్షలకూ 5 వేలు బోనస్ కలిపి ఇచ్చేసే వాళ్ళు మళ్ళీ డిపోసిట్ చేసినప్పుడు ఏజెంట్ ద్వారా చేయిస్తే ఏజెంట్ కు వచ్చే 2% కమీషన్ లో ఆ ఏజెంట్ 1% మనకే ఇచ్చేసే వాడు !కష్టపడి డబ్బులు పొదుపు చేసుకున్నవాళ్ళు ఇంక సంపాదించలేని స్థితిలో ఈ పోస్టాఫీస్ డిపాజిట్ లు ఎంతో ఉపయోగ కరం గా ఉండేవి !
ఇప్పుడు ఒంట్లో సత్తువ ఉన్నపుడు బాగా కష్టపడి... కడుపుకట్టుకుని భవిష్యత్తుకోసం పొదుపుచేసినా కేవలం లక్షకి నెలకు 500/- మాత్రమే ఇస్తున్నారు బోనస్ లూ లేవు
పెర్సటేజ్లులేవు !!
ఆరోజుల్లో చెల్లి ఆవచ్చిన వడ్ఢేతో... ఇబ్బంది లేకుండా బ్రతుకు తుండేది !
పిల్లలిద్దరూ బుద్ధిమంతులు !
పెద్దవాడు పాలటెక్నీక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు చిన్నవాడు టెన్త్ పరీక్షలు 2 రోజుల్లో మొదలవుతాయి...
సడెన్ గా చెళ్ళికూడా హార్ట్ ఎటాక్ తోనే చనిపోయింది !!
భార్యాభర్త లిద్దరూ దురదృష్టవంతులే ! ఎందుకoటే ఇప్పుడు ప్రయోజకులై ఉద్యోగాలు చేసుకుంటున్న కొడుకులను చూసుకు మురిసిపోతూ వాళ్ళ సంపాదనను హాయిగా అనుభవించే అదృష్టానికి నోచుకోలేక పోయారు కదా.. !!
******-
........ సశేషం ........
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి