గీతాంజలి ;రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 52. నీకరుణ నాలో ప్రతిఫలించనీ...
నీ కరుణను అందుకోవటానికి నేనే లేకపోతే నీ కరుణంతా ఏమైవుండేది స్వామీ... అంటూ భక్తుడు భగవంతుణ్ణి కొంటెగా ప్రశ్నిస్తున్నాడు. నీ సకలసంపదలకు నన్ను వారసునిగా తీసుకుని నీ కృపను నా హృదయంలో తాండవింపజేస్తున్నావు. అంటూ ఈశ్వర తత్వాన్ని కొనియాడుతున్నాడు.
ప్రకృతి సౌందర్యసృష్టితో నన్ను సమ్మోహితుణ్ణి చేస్తూ నా హృదయాన్ని నీ ఆధీనంలో వుంచుకోవడానికి యత్నిస్తున్నావు. నా జీవితంలో నీ సంకల్పం నూతన రూపాలను పొందుతుంది. నీ సకల సంపదలకు నన్ను వారసుడిగా తీసుకున్నావు. అందుకే నీ ప్రేమ నా ప్రేమతో విలీనమైనా ఆ ఏకత్వంలో “ నీవే" వ్యక్తమౌతావు ప్రభూ... అంటూ లోకేశ్వరుణ్ణి కీర్తిస్తున్నాడు.
          
కామెంట్‌లు