అంతరాత్మ అనే దాన్ని ప్రశ్నించుకుని దానికి జవాబు చెప్పుకోగలిగితే నువ్వే అర్థరహితపనీ చెయ్యలేవంటాడు ఒక గురువు తన శిష్యుడితో...
ఇది కళ్ళు తెరిపించిన మాట
కనుక
నన్ను నేను ప్రశ్నించుకుంటుంటే
నేనొక్క దానికీ సరైన జవాబు చెప్పుకోలేకపోయాను
అంటే నా ఆలోచనలన్నీ
ఎంత అర్థరహితమో తెలిసొచ్చింది
అంతరాత్మ ప్రబోధాన్ని కూడా పట్టించుకోకుండా చేసే వాటివల్ల మరింత అట్టడుగుకి పోవడం తప్ప మరొకటుండదుగా
కనుక
నన్ను దిద్దుకోవడానికి
నేనే మారాలి
ఎవరో వచ్చి
ఆ పని చేస్తారనుకోవడం
మూర్ఖత్వం
ఎందుకంటే
తప్పో
ఒప్పో
ఏదైనా నా చర్యకు ప్రతిచర్యేగా
ప్రతిఫలమేగా
అందుకే
నన్ను నేను
సరిదిద్దుకునే విధంగా
నడక నడత ఉండాలి
అంతరాత్మ ప్రబోధం
ఆణిముత్యమే అని
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి