, ** 50 ***
*******
నేను రేడియో కి ఆకర్షితుడ నవటం కూడా... నేనుఉమా స్టూడియో లో పనిచేస్తున్న రోజులలోనే... ! అప్పట్లో ఓ చిన్న రేడియో కేవలం అరచె య్యంత సైజులోనే ఉండేది !
స్టేషన్ ఓపెన్ ఔతున్నప్పుడు
వచ్చే మ్యూజిక్ సుప్రభాత మేల్కొల్పు లా... హాయిగా వినిపించేది ఆ శ్రావ్య సంగీతం వింటుండగానే... ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అంటూ
కార్యక్రమాలు మొదలయ్యేవి !
భక్తి సంగీతం, కార్మికుల కార్యక్రమం, వనితావాణి, నాటికలు, నాటకాలు... నామనసుకు హత్తుకుంటుం డేవి !అలా చాన్నాళ్ల తరువాత
నేను సొంతంగా భవానీ స్టూడి యోను పెట్టుకున్న తరువాత...
ఓ రోజు... ప్రతిధ్వని అంటూ రేడియో లో వాళ్ళేదో ఒక వాఖ్యాన్నివ్వటం కవితలు రాసి పంప మనటం విన్నాను మొదటిసారి ప్రతిధ్వనికవితలు విన్నతరువాతరెండోసారినేనుకూడా ఓ పోస్ట్కార్డుపైకవితరాసి విశాఖపట్నం రేడియో కేంద్రానికి
పంపటం, వారు నాకవితను కూడా చదవటం..., నాకు చాలా ఆనందాన్నిచ్చింది !
అదిమొదలు... నా ప్రతిధ్వని కవితలు సుమారు పదిహేనో
పదహారో ప్రసారమయ్యాయి!
ఓమారుకార్మికులకార్యక్రమంలో
ఒకవాక్యం... "ఓర్చుకోవటం కష్టం... ఫలితం మాత్రం మధురం "పై వాక్యానికి లఘు నాటికలు రాసి పంపంటే... ఓ ఫ్యాక్టరీ స్ట్రైక్ లో కార్మికులు పడే పాట్లూ... న్యాయమైన
వారిహక్కులకోసం వారుచేసిన పోరాటం విజయవంతమై...
యాజమాన్యం కార్మికుల డిమాండ్లను ఆమోదించటం
ఇతివృత్తంగా నేనో నాటిక రాసి పంపటం దాన్ని ఆలిండియా రేడియో విశాఖ పట్నం వారు
వాళ్ళకళాకారుల గాత్రాభిన యంతో రచయితగా నాపేరు చెప్పి... ప్రసారం చెయ్యటం !
నాకెంతో ఆనందాన్ని కలిగిం చింది... !!
నా రావణ బ్రహ్మ ఏకపాత్ర
నాగశ్రీ వంగవోలు వెంకట శాస్త్రి గారి రచన... నాగాత్రంతో...
ఆలిండియా రేడియోలో వినాలన్న కోరిక నేటికీ నెరవేర లేదు గానీ... మిత్రులు Pvb.శ్రీరామమూర్తిగారు, అయ్యగారి శ్రీనివాసరావు గార్లు
ఓ మారు స్టూడియోకి వచ్చి...
మీకు రేడియో లో పదినిము షాలు ప్రసంగానికి అవకాశ మిప్పిస్తామువెళతారా అనగానే
చెప్పలేని ఆనందం... !!
తీరా ఇచ్చినవిషయమేమంటే
పోటీ పరీక్షలకు యువత ఎలా సిద్ధం కావాలి...ఈ అంశానికి నేనే ప్రసంగం తయారు చేసుకుని రేడియో స్టేషన్ కు వెళ్లి చదవాలి ! నాకున్న పరిజ్ఞానము... పోటీ పరీక్షలకు సంబంధించిన విషయ సేకరణ తో... మ్యాటర్ తయారుచేసి...
మిత్రులకు చూపించటం వారుచాలాబాగుంది అనటం...
నేనువెళ్లటం...నాపదినిముషాల ప్రసంగాన్నీ రికార్డు చేసి ప్రసారం చెయ్యటం... !
తరువాత రెమ్యూనిరేషన్ అమౌంట్ చెక్ పంపించటం నెనాకెక్కుని చూసి మురిసిపో వటం !!
ఐతే నేను అనేకానేక అనుభ వాలతో తేల్చుకున్నదేమంటే సాహిత్య కళా రంగాలలో అవకాశాలు రావటం గానీ...
పోటీలలో బహుమతులు రావటంలోగానీ... ఎక్కువ ప్రభావం చూపించేవి... డిగ్రీలు,
బిరుదులూ లాంటివి మనపేరుకు ముందు మూతులైనా ఉండాలి వెనుక
పేరుచివర తోకలైనా పెరిగుండాలి.. !లేదా మంచి పరిచయాలైనా కలిగి ఉండాలి
అంతేగానీ... మనకు విద్వత్తు ఎంత ఉన్నా ఇలాంటివేవీ లేకపోయినట్లయితే...మననెవరూ పట్టించుకోరు అనేది...
నా అనేకానేక అనుభవాలతో నేను తెలుసుకున్నది... !
******
...... సశేషం .......
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి