సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం

 ఎదిగే పిల్లల మదిలో...
********
మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దుకునేందుకు
పూలు, ఫలాలతో పాటు మరెన్నింటినో పొందేందుకు, ఆనందం, ఆరోగ్యం కోసం రకరకాల విత్తనాలు నాటుకుంటాం
బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు,గురువులుగా ఎదిగే పిల్లల మదిలో సరైన ఆలోచనా, సత్ప్రవర్తన బీజాలు నాటాలి. అప్పుడే పిల్లలు సక్రమమైన మార్గంలో ఎదుగుతారు.
మంచి అలవాట్లు, సభ్యత, సంస్కారంతో పాటు ఆత్మ విశ్వాసాన్ని కూడా నాటితే ఎదిగిన కొద్దీ ఉన్నత వ్యక్తిత్వంతో ఒదుగుతూ...సమాజంలో విలువల ఫలవృక్షాలై మన్ననలు పొందుతూ ,నైతిక ప్రపంచానికి  వారధులు అవుతారు.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు