ఆకాశవాణి (రేడియో)పై కవిత ; -అచ్యుతుని రాజ్యశ్రీ

 అందరివాణి ఆకాశవాణి! అశరీరవాణి!
మాటలగీర్వాణి!పాటల కీరవాణి!
అందరినీ అలరించే పూబోణీ!
స్త్రీల పిల్లల విరిబోణి!
భావనతో పలకరించే సుభాషిణి!
దేశభక్తి దైవభక్తి రంగరించే హితైషిణి!
కవుల కలాలు గళాలకు ప్రాణంపోసే  కలభాషిణి!
పాడిపంటమొదలు సంగీతసాహిత్య విజ్ఞాన వినోదాలు పంచే విశ్వవాణి మన ఆకాశవాణి!
అంతంలేని నిర్మల పావన గంగ
తెలుగు గుండెల మీటే వీణావాణి!
పురాణప్రవచనాల జలతరంగిణి!
ఇదేఇదే మన అందరి వాణి శర్వాణి!🌹
కామెంట్‌లు