నాబాల్యంఅంతా రేపల్లె తాలూకా వేమూరులో గడిచిపోయింది; -మొదలి అరుణాచలం; సేకరణ ; అచ్యుతుని రాజ్యశ్రీ

 వీరి  పేరు  శ్రీ మొదలి అరుణాచలంగారు. రేడియో లో ఉన్నతపదవులు అలంకరించారు. 1979-1995దాకా  రచనావ్యాసంగం రేడియో ఉద్యోగం  సంసారం లో చక్కగా తన పాత్రను పోషించి ఒక అమ్మాయి  అబ్బాయి కి  ఉన్నత చదువులు  చెప్పించారు.మనవల తో సత్కాలక్షేపం.ఆయనకథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడినాయి.ఒక కథకు బహుమతి వచ్చింది.3నవలలు కూడా రాశారు.
 ఇక ఆయన తనజీవితం గూర్చి ఇలా చెప్పారు "నేను 1935లోవిజయవాడలో అమెరికన్ ఆసుపత్రి లో పుట్టాను.మాతల్లి దండ్రులు శ్రీ మతి సీతారావమ్మ  మొదలి విశ్వనాథ శర్మ గార్లు.మానాన్న ను నాబాల్యంలోనే కోల్పోయిన  నాకు మాతాతగారే సర్వస్వం!మానాన్న  పెట్రోల్ బంక్ నడిపేవారు.ఆయన మృతితో మాతాతగారు పుత్రశోకాన్ని దిగమింగి ఇద్దరు మనవలు ఇద్దరు మనవరాళ్ల ని పెంచి పెద్ద చేసారు. ఆయన వలననే మాకు దైవభక్తి  సంధ్యావందనం  సంస్కృతి సాంప్రదాయాలు పాటించటంఅలవడినాయి.ఇప్పటికి మాకుటుంబంలో మాపిల్లలు కూడా  అలాగే పాటిస్తున్నారు. మాతాత గారు ఆరోజులలో అప్పటి భారతీయ సెంట్రల్ బ్యాంక్ లో హెడ్ క్యాషియర్ గా పనిచేసే వారు.దక్షిణ భారత దేశంలో  బదిలీల వల్ల చాలా ప్రాంతాలలో తిరిగారు. నాబాల్యంఅంతా రేపల్లె తాలూకా వేమూరులో గడిచిపోయింది. చదువు ఇల్లు అంతే!ఓసామాన్య విద్యార్ధి గా గడిచిపోయింది. గుంటూరులో ఎ.సి.కాలేజ్ హిందూ కాలేజ్ లో పి.యు.సి.బి.ఎ.చదివి  ఎం.ఎ
బెనారస్ యూనివర్సిటీ లో చేశాను. మేనమామకూతురు రాజవర్ధనితో పెళ్ళి ఐంది.ఉద్యోగం వేటలో పడ్డాను. ఆరోజులలో జాబ్ దొరకటం చాలా కష్టం!యు.పి.ఎస్.సి.ద్వారా  మినిస్ట్రీ ఆఫ్ హెల్త్  ఫామ్లీ వెల్ఫేర్ శాఖలో ఉద్యోగం వచ్చింది.1950నించి  జాబ్ వల్ల  ప్రమోషన్ల పై ఢిల్లీ కలకత్తా  మొదలైన చోట్లలో ఉద్యోగంలో రకరకాల అనుభవాలు బాధ్యతలు!అంతగా ఇప్పుడు గుర్తు లేవు.
ఇక అమ్మ  నాయనమ్మలకు  దగ్గరగా ఉండాలి అని ఐ.అండ్.బి.యు.పి.ఎస్.సి.ద్వారా  ఫామిలీ వెల్ఫేర్ ఆఫీసర్ గా సెలక్ట్ అయ్యాను.1975 నించి హైదరాబాదు ఆకాశవాణి తో బంధం అనుబంధం  జీవితంలో మరువలేని బ్రహ్మానందం అనే చెప్పాలి.కుటుంబ నియంత్రణ పై విపరీతమైన ప్రచారం పాటలు నాటకాలు  రూపకాలద్వారా  ప్రజలలోకి చొచ్చుకుపోయేలాచేయటంలో నేను కృత కృత్యుడిని అయ్యాను.మంచి గుర్తింపు  ప్రజలతో మమేకం కావటం మర్ఛిపోలేని అనుభూతి. ఫామిలీ ప్లానింగ్ ప్రోగ్రాములు  వల్ల  తరువాతి కాలంలో  కుటుంబ నియంత్రణ గూర్చి  జనాలకి చెప్పే అవసరం ఇప్పుడు లేదు. పల్లెలో గూడా రేడియో వారంటే చాలా గౌరవం ప్రేమ ఆప్యాయత పెరిగి ఎక్కడకెళ్లినా  వారి తో మమేకమై పోయేవాడిని.జాబ్ లో పూర్తి తృప్తి  ఆనందంతో  రిటైర్ అయ్యాను.మారేడియో వారికి  గుర్తింపు  గౌరవం ఏమాత్రం తగ్గలేదు సుమా!"
తన 83 వ ఏటదాకా తన పనులు  సంధ్యావందనం దైవపూజల్లో గడిపిన  శ్రీ చలంగారు  ప్రస్తుతం తుంటి ఫ్రాక్చర్ వల్ల  లేవలేక నడవలేక పోతున్నారు. కానీ పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ   కూతురు కొడుకుల ఉన్నతి వారి ప్రేమ ఆప్యాయత భార్య  తోడు నీడలో ఆనందం గా ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. 🌷
కామెంట్‌లు