చెలి చేసిన గాయం; పోపూరి మాధవీలత;-కలం.. స్నేహం
మది విరి తోటలో
అనుకోని అతిధిలా.. 
ఆమె ఆగమనం.. 
జాజులు విరిసిన అనుభూతినిస్తూ.. 
ఆకసాన జాబిలి.. 
నా ఎద లోయలో  ..
తొంగిచూసి.. 
వెన్నెలను పంచి.. 
వలపు నావపై విహారాల.. 
అనుభవాన్ని పంచింది.. 

ఆమె నవ్వుల  గలగలలో..
జలపాత హోరులు నింపుకుని.. 
నా మది లోగిలి లో.. 
వసంత ఆమని  రవాలను 
నింపి.. 
అనురాగ మరులు పంచింది.. 

ఆమె ఎదను మీటిన సంతసాల సంబరాలు... 
నా గుండె  చెక్కిలి పై.. 
చెక్కిన శిల్పమై నిలిచింది.. 

శరత్కాల వెన్నెల రోజులన్నీ
నీకై వేచి.. 
నీ కౌగిలి లో దరిచేరని.. 
ఈ...నా   జీవన మజలీలో.. 

ఆమె  జ్ఞాపకాల మరులు.. 
మస్తిష్క పొరలలో తిరుగాడుతూ.. 
జ్వాలలే రేపగా.. 

ఆమె గుచ్చిన
 ప్రేమ బాణమే... 
విచ్చికలుగా గుండెను చీలుస్తూ.. 
ఎద గాయమే చేసి.. 

 ఎద వాకిలిలో.. 
రుధిర మరకలను మిగల్చగా.. 

అందని తీరాలకు వెడుతూ.. 

ఆమె అడుగుల సడి.. 
దూరమౌతూ.. 
కలతలే రేపుతూంటే.. 

నిశీధుల నీడలలో కరిగిపోయే ఆమె తలపులను వెతుక్కుంటూ.. 

ఆమెకై ...విశ్వం వంకా ఆశగా 
వేచిచూస్తున్నా.. 

ఆద్యతం.. 
నీ వెంట నేను.. 
నా వెంట నీవు.. నీడలా.. 

నీలో నేను.... 
నాలో..నీవు .. శ్వాసలా... 
అంతర్లీనమవ్వ లేని జీవితం కన్నా.. 

మరణమే.. మేలు
నా తరుణి లేని..ఏ తరుణమైనా.. 

 

కామెంట్‌లు
Kalaivani చెప్పారు…
Very very nice. Fantabulous Madhu. Keep it up.
Unknown చెప్పారు…
Me kavitha chala bagundi Madhavi garu
nareshsiripuram చెప్పారు…
"చెలి చేసిన గాయం" గూర్చి చక్కనైన ప్రతీకలతో.. ఎంతో చక్కగా.. హృద్యంగా మీ కవితను మలిచారండీ..

మీ చక్కనైన రచనా ప్రతిభకు మా జోహార్లు.. మీకు హార్థిక అభినందనలు..💐💐