"ఓటు";-: జరుగుమల్లి వీరయ్య, కలికిరి చిత్తూరు జిల్లా

 ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం "ఓటు
                       ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం మనది.
ఐదు సంవత్సరాల కొకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. అందుకే దేశంలో ఓటరు కు ప్రత్యేక స్థానం ఉంది. తన ఓటు హక్కు తో నచ్చిన వారిని అందలం ఎక్కించగలరు.. నచ్చకపోతే పదవుల్లోంచి దింపేయగలరు. ఎంతో విలువైన ఈ "ఓటు" ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటిది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ "ఓటు" అనే బ్రహ్మాస్త్రంతో శాసించగలిగే హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించింది. అయితే భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన రోజైన 1950 జనవరి 25 ను జాతీయ ఓటర్ల దినోత్సవం గా జరుపుకుంటున్నాం.
           ఓటంటే చైతన్య గీతం
ఓటంటే ఓట్టి మాటల కోట కాదోయి..
ఓటంటే ప్రజాస్వామ్యపు బాట సుమా..!!
ఓటంటే ఇంకు చుక్క కాదోయి..!
ఓటంటే వ్యవస్థనే మార్చుకునే వెలుగు చుక్క సుమా..!!
ఓటంటే అసామాన్య స్వరబాణి కాదోయి..!
ఓటంటే ప్రజాస్వామ్యపు వజ్రాయుధం సుమా..!!
ఓటంటే స్వార్థాల వ్యవహారం కాదోయి..!
ఓటంటే నిస్వార్థాల సమాహారం సుమా..!!
ఓటంటే అమ్ముకునే సరుకు కాదోయి..!
ఓటంటే అంబులపొదిలో శరము సుమా..!!
ఓటంటే రాచరికపు పీఠం కాదోయి..!
ఓటంటే  రాజ్యాంగం కల్పించిన  మన హక్కు సుమా..!!
ఓటంటే చిత్తు కాగితం కాదోయి..!
ఓటంటే చైతన్య గీతం సుమా..!!
ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు...    జరుగుమల్లి వీరయ్య.
కామెంట్‌లు