ఆడబిడ్డ;-కావ్య నరేష్-కలం స్నేహం
తిరగబడ్డది పోరాటం...
రగులుతున్నది స్త్రీ జాతి....
ఆడదాని ప్రాణానికి విలువ లేని సమాజం....
ఆడదాని మానానికి రక్షణ లేని సమాజం.....
యుగాలు ఎన్ని మారిన....
కాలాలు ఎన్ని మారిన....
ఆడబిడ్డ బతుకంటే చిన్నచూపే అందరికి....

పూర్వకాలం ఆడబిడ్డకు కట్టుబాట్లు ఎన్నో....
డబ్బు కోసం అమ్మే ముసలి తనానికి....
భర్త చనిపోతే భార్యకు చేసే చితి సన్మానం....
సతిసహన గమనాన్ని చాటి చెప్పిరందరు....
ఇది ఎంతకు సంస్కారం....
ఇది ఏమి మానవత్వం.....

తాళి బొట్టుకు కట్టుబడి ఉంటుంది ఆడది....
భర్త మాటను జవదాటదు స్త్రీ మూర్తి....
చేసిన వెధవ పనులను భరిస్తుంది ఆధరణి....
యుగాలు మారినా మారదు ఈ మనస్తత్వం....
కాలాలు మారినా కరగదు ఈ అకృత్యం...


కామెంట్‌లు