"అపూర్వ కానుక" ;-కమల ముక్కు;-కలం స్నేహం
 లేమిలో బ్రతుకుతున్నా 
మనసు మాత్రం మిన్న!

పేదరికంలో మగ్గుతున్నా 
ఆప్యాయతానురాగాల కొమ్మ!

కష్టాలెన్నున్నా బాధలెన్నున్నా 
ఆర్థిక భరోసా అందించిన వారికో 
కానుక ఇవ్వాలన్న తపన!

స్థాయికి మించినదైనా 
ఆప్తుల కళ్లల్లో 
ఆనందం చూడాలన్న కోరిక!

రూపాయీ రూపాయీ పోగేసి 
అపూర్వమైన కానుకను కొని 
బంగారం లాంటి మనసున్న మనుషులకు 
సంతోషంగా అందిస్తూ 
మురిసిపోయే మనస్తత్వం!

అభిమానమే ఉంటే 
అంతస్తులేవీ అడ్డురావు
బంధాలు పదిలం 
చేసుకోవాలన్న ఆలోచన తప్ప!

ఆప్యాయతే ఉంటే 
కలిమిలేమిలు అడ్డంకులు కావు
బంధాలను కలకాలం
నిలపాలన్న కోరిక తప్ప!

కామెంట్‌లు