అందనంత దూరంలో ఉన్న
నే నెక్కడుంటే అంత దగ్గరగా ఉన్నట్లు
పగలంతా నన్ను కాపాడిన సూర్యుడు
అచ్చం మా అమ్మలా !!?
ఎంత దూరంలో ఉన్న
నే నెక్కడుంటే అక్కడ అంత దగ్గరగా
రాత్రంతా చల్లని వెన్నెల నిచ్చిన చందమామ
అచ్చం మా అమ్మలా!!?
ఎక్కడో హిమాలయాల్లో పుట్టి
అన్ని దాటుకుంటూ నా కోసం
ఇంకా పారుతున్న ఆ గంగా నది
అచ్చం మా అమ్మలా !!?
నా కంటికి కనిపించకున్న
నన్ను వీడక చల్లని స్పర్శ తో
తన ఒళ్లో దాచుకున్న ఆ చల్లని గాలి
అచ్చం మా అమ్మలా!!?
వీచే గాలి చప్పుడు గల గల పారే సెలయేరు
ఎంతో ఎత్తు నుంచి దుమికే జలపాతం
నన్ను పిలుస్తుంది
అచ్చం మా అమ్మలా!!?
పూచే పువ్వు విచ్చుకునే పసిపాప నవ్వు
మళ్ళీ మళ్ళీ చిగురించే లేత ఆకు
అచ్చం మా అమ్మలా అనిపిస్తుంది!!?
ఊరి చెరువు పచ్చని పైరు
పిల్లల పరుగులాంటి పిల్ల కాలువ ల
కాలినడక దారుల్లో
అచ్చం మా అమ్మ అడుగులు కనిపిస్తున్నాయి !!?
గుడి తలుపులు తెరిచిన
బడి తలుపులు తెరిచిన
మా అమ్మ పాడిన పాట మాట
మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి !?
ఆకలేసినప్పుడు నిద్ర ముంచ్చు
కొచ్చినపుడు
భయమేసి నప్పుడు
కలలో బెదిరి కలవరించినప్పుడు
అమ్మ పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది!!?
పండుటాకు రాలుతుంద ని
ఎప్పటికైనా చెట్టు నేల కూలుతుందనీ
తెలియక
అమ్మ ఆకాశంలా ఎప్పటికి ఉంటుందని
అందరిలా నేను ఆశ పడ్డాను !!?
అమ్మ స్మృతిలో 18/03/2022
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి