సుఖీభవ - సుఖీభవ --కోరాడ నరసింహా రావు
అమ్మానాన్నల తనివి తీరగా 
కిరణ న్నకు తమ్మునిగా... 
బర్లవారి ఇంటనీవు 
నాగరాజు, తోరణీలకు 
పుట్టినావు తన్వీర్... !

నీవారందరు ఆనందంతో 
ఆశీర్వదించి,శుభాకాంక్షలే 
అందించగా... సంతోషంతో 
ఏటికిఏడూ...ఆత్మీయులందరిమధ్య, నీ జన్మదిన వేడుకలతో నువ్ నూరేళ్లు చల్లగవుండు... తన్వీర్ !

నువ్ పెరిగి, పెద్దవాడవైతే... 
ప్రయోజకుడవై పేరును తెస్తే...
నువ్ బోర్ల పడినా, బంగిరినా తడబడు బుడి - బుడి అడు గులు వేసినా..., బోసినోటితో నవ్వులు రువ్వినా, పొంగిపోవు అమ్మమ్మా తాతలు ఆ దివి నుండి దీవించెదరు, నువ్ కలకాలం  సుఖశాంతులు బొందగ!
చిరంజీవ... చిరంజీవ, సుఖీభవ... సుఖీభవ !

కామెంట్‌లు