ఎలుగుబంటి చెవులు!అచ్యుతుని రాజ్యశ్రీ

 పూర్వం ప్రతివారూ బంగారం వెండి నాణాలరూపంలో తమ సంపదను కుండల్లో దాచిభూమిలోపల పాతేసేవారు.ఊరిప్రయాణలప్పుడు వ్యాపారులు సంచీలో నాణెములు పోసి నడుముకి
చుట్టుకొని ఆపైధోవతి చొక్కా ధరించేవారు.మరిదొంగలభయం కాబట్టి జేబు లో దాచుకునేవారుకాదు.ఆరోజు ఒక వ్యాపారి అలాగే నడుము కి నాణాలసంచీ కట్టుకుని వెళ్తున్నాడు.ఒక ఎలుగుబంటి ఎక్కడనించో వచ్చి అతన్ని పట్టుకుంది. తెలివిగలవాడు కావటంతో దాని చెవుల్ని పట్టుకొని బాగా మెలిపెట్టి పిండసాగాడు.ఈపోరులో అతని నడుముకున్న నాణాలమూట ఊడి నాణాలు అన్నీ నేలపై దొర్లాయి.అతన్ని అనుసరిస్తూ వస్తున్న  ఓబాటసారి ఇదిచూసి వ్యాపారిదగ్గరకొచ్చి "ఎలుగు బంటి చెవులు పట్టుకొని తిప్పితే బంగారు నాణాలు ఇలా క్రిందకు రాలుస్తుందా?"అని అడిగాడు. తెలివిగల వ్యాపారి"అవును! కావాలంటే నీవు కూడా ఎలుగు బంటి చెవులు మెలిపెట్టి తిప్పుతూఉండు."అంతే  ఆ అమాయకపు బాటసారి ఆవ్యాపారిచేతులు విడిచాక తను పట్టుకొని గట్టిగా మెలితిప్పసాగాడు.వ్యాపారి  ఎంచక్కా నాణాలు ఏరుకుని తనదారిన తాను పోయాడు.బాటసారి ని ఎలుగు బంటి చంపింది.
దీన్ని బట్టి మనంఏం తెలుసు కోవాలి అంటే కొత్త వారి మాటలు నమ్మరాదు.అనవసరం గా అడవిజంతువుల జోలికి వెళ్లి  వాటిని కవ్వించి హింసించరాదు.వాటిని ఇబ్బంది పెడితే వేరే దారిలేక మనపై దాడి చేస్తాయి.పిల్లిఐనా సరే గది లో పెట్టి కొడితే  ఎదురు దాడిచేసి మన కనుగుడ్లు పీకుతుంది.తస్మాత్ జాగ్రత్త!🌹
కామెంట్‌లు