ప్రమిల . పురాణ బేతాళ కథ.; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించిఉన్న బేతాళుని బంధించి భుజంపై చేర్చుకుని మౌనంగా బయలు దేరాడు.అప్పుడు శవంలోని బేతాళుడు 'మహారాజా నీపట్టుదల అభినందనీయమే,నాకు ప్రమిల గురించి తెలియజేయీ.తెలిసి చెప్పకపోయావోమరణిస్తావుఅన్నాడు.
' బేతాళా ప్రమీల మహాభారతంలో అందరూ స్త్రీలు ఉండే రాజ్యానికి రాణి. ఈ రాజ్యంలో స్త్రీలే పరిపాలకులు, యుద్ధ వీరులు.
' బేతాళా దిలీపుడు చక్రవర్తికి ప్రమీల కుమార్తె. ఒకరోజు దిలీపుడు, ప్రమీల తమ సైన్యంతో కలిసి వేటకు వెళ్ళారు. ఆ అడవితో పార్వతీ దేవి, శివుడితో రమిస్తూ ఉంది. ఆమెను దిలీపుడు, అతని సైన్యం చూడగా. వెంటనే పార్వతి కోపోద్రిక్తురాలై, రాజ్యంలోని వారందరు స్త్రీలుగా మారాలని శపించింది. అప్పటినుంచి అది స్త్రీల రాజ్యంగా మారింది. శాప పరిహారం గురించి కోరగా, ఇంద్రుని కుమారుడైన అర్జునుడు ప్రమీలను వివాహం చేసుకుంటాడో, ఆరోజే మీకు శాపవిముక్తి కలుగుతుందని పార్వతీ దేవి చెప్పింది. పంపానది తీరానున్న సీమంతి నగరంలోని స్త్రీలతో జరిగే యుద్ధంలో ఎంతటి బలమైన వారైన ఓడిపోయేవారు. తమతో అనవసరంగా వైరం పెట్టుకున్న కుంతల రాజు విజయవర్మని మల్లయుద్దంలో ఓడించిన ప్రమీల, అతని రాజ్యాన్ని, అతని రాణులకు, కుమారులకు అప్పగించి, అతడిని బందీగా తమ రాజ్యానికి తీసుకువస్తుంది.
వ్యాసుని సూచన మేరకు ధర్మరాజు అశ్వమేథయాగం చేయగా, సీమంతినీ నగర కాపాలదారులకు ధర్మరాజు యాగాశ్వం దొరుకుతుంది. ఆ అశ్వాన్ని ప్రమీల తన అశ్వశాలలో కట్టేయించి, తనతో యుద్ధం చేసి, యాగాశ్వాన్ని విడిపించుకోమని, తన దండనాయకి వీరవల్లితో అర్జునుడికి లేఖ పంపుతుంది. విడిపించడానికి అర్జునుడు వెళ్ళగా వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. అర్జునుడు ప్రమీల చేతిలో ఓడిపోతాడు. అర్జునుడు శ్రీకృష్ణుణ్ని స్మరించగా. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ప్రమీలార్జునులకు గాంధర్వ వివాహం జరిపిస్తాడు.'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.


కామెంట్‌లు