ఓ జాబిలమ్మ ..!;-   -కయ్యూరు బాలసుబ్రమణ్యం శ్రీకాళహస్తి
పాల మీగడ వలె ఉండు
పంచదార వలె ఉండు
మన తెలుగు భాష
ఓ జాబిలమ్మ ...!

అమ్మ ప్రేమ వలె ఉండు
నాన్న లాలన వలె ఉండు
మన తెలుగు భాష
ఓ జాబిలమ్మ ...!

అమృత ధార వలె ఉండు
తొలకరి జల్లు వలె ఉండు
మన తెలుగు భాష
ఓ జాబిలమ్మ..!

పరమాన్నం వలె ఉండు
ముద్ద పప్పు వలె ఉండు
మన తెలుగు భాష
ఓ జాబిలమ్మ..!

సద్దన్నం వలె  ఉండు
ఆవకాయ వలె ఉండు
మన తెలుగు భాష
ఓ జాబిలమ్మ..!

ఆవుపాలు వలె ఉండు
మంచు బిందువలె ఉండు
మన తెలుగు భాష
ఓ జాబిలమ్మ..!


కామెంట్‌లు