చిత్రాంగదుడు. పురాణ బేతాళకథ.; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు
 పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించిఉన్న బేతాళుని బంధించి భుజంపై చేర్చుకుని మౌనంగా బయలు దేరాడు.అప్పుడు శవంలోని బేతాళుడు 'మహారాజా నీపట్టుదల అభినందనీయమే,నాకు చిత్రాంగదుని గురించి తెలియజేయీ.తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు'అన్నాడు.
'బేతాళా  శంతనుడు, సత్యవతిల మొదటికుమారుడు. విచిత్రవీర్యుడు ఇతనితమ్ముడు. భీష్ముడు సత్యవతికికాక శంతనుడు, గంగలకు కలిగినకుమారుడు. భీష్ముడు తన శపథం మేరకు చిత్రాంగదుని హస్తినాపుర సింహాసనానికి పట్టాభిషిక్తుని చేసాడు. చిత్రాంగదుడు బలవంతుడనని అహంకారము కలవాడు. అదే పేరు కలిగిన ఒక గంధర్వ రాజు చిత్రాంగదుని యుద్ధానికి పిలిచాడు. ఆ యుద్ధంలోగంధర్వరాజుచిత్రాంగదునిచంపాడు.చిత్రాంగదునిమరణంతరువాత భీష్ముడు విచిత్రవీర్యుని పట్టాభిషిక్తుని చేసాడు.శంతన మహారాజు గంగాదేవిని కలిసి భీష్ముడిని పుత్రునిగా పొందుతాడు. అష్టవసువుల శాపాన్ని ఉద్ధరించడానికి ఆమె పుట్టిన వెంటనే ఏడుమంది శిశువులను గంగపాలు వేస్తుంది. అష్టమ వసువైన భీష్ముడిని చంపబోగా శంతనుడు ఆమెను వారించడంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆమె శంతనుణ్ణి వదిలి వెళ్ళిపోతుంది. తర్వాత శంతనుడు సత్యవతిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కానీ తనకు పుట్టబోయే సంతానానికి రాజ్య అర్హత ఉండదని అడ్డుపడుతుంది. అప్పుడు భీష్ముడు తనకు రాజ్యం వలదనీ, పెళ్ళి కూడా చేసుకోనని ఆమెకు మాట ఇచ్చి తండ్రి వివాహం జరిపిస్తాడు. తర్వాత ఆమెకు ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. ఒకరు చిత్రాంగదుడు. మరొకడు విచిత్ర వీర్యుడు. వీరు చిన్నతనంలో ఉండగానే శంతనుడు మరణించాడు.
రాజ్యభారమే కాక వారిద్దరి పోషణా భారం కూడా భీష్ముడిమీద పడుతుంది. భీష్ముడు వారిని పెంచి పెద్దచేసి ముందుగా పెద్దవాడైన చిత్రాంగదుడిని రాజును చేస్తాడు. అతను మహావీరుడై అనేక యుద్ధాలు చేస్తాడు. అదే అహంకారంతో తన పేరే కలిగిన గంధర్వరాజుతో యుద్ధం చేసి మరణిస్తాడు. దాంతో భీష్ముడు అతని తమ్ముడైన విచిత్రవీర్యుని రాజును చేస్తాడు' అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగంకావడంతో శవంతోసహా మాయమైన బేతాళుడు మరలా చెట్టుపైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

కామెంట్‌లు