సునంద భాషితం;-వురిమళ్ల సునంద ఖమ్మం
 చెయ్యాల్సింది...ఇవ్వాల్సింది...
******
చెయ్యాల్సింది.. ఇవ్వాల్సింది ..ఈ రెంటి పట్ల చిత్తశుద్ధి కలిగి వుండాలి.
చెయ్యాల్సింది మంచిదైతే ఏమాత్రం తాత్సారం చేయకుండా తక్షణమే చేసేయాలి.
తర్వాత చేద్దాం అని వాయిదా వేశామా ఆ పని పూర్తి చేయలేని పరిస్థితులు రావచ్చు.
అందుకే కబీర్ దాస్ లాంటి మహనీయులు రేపటికి రూపం లేదు అంటుంటారు.
ఇక ఇతరులకు ఇవ్వాల్సిన అభిమానం,దయ, వాత్సల్యం, భరోసా,ప్రేమ..ఇలా ఏమైనా కావచ్చు మనసులో దాచుకొని..
ఆలస్యం చేయడం వల్ల ఏవైనా అనుకోని ఆటంకాలు కలగొచ్చు.
సరైన సమయంలో ఇవ్వకపోతే.. తీసుకునే వారిలో అసంతృప్తి,మనలోనూ  ఇవ్వలేకపోయామే అన్న బాధ కలగవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు