ఎద్దులు (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మాఇంటి ఎద్దులండి 
మామంచి ఎద్దులండి 
గడ్డితినే ఎద్దులండి 
కుడితితాగే ఎద్దులండి 
పొలముకెళ్ళే ఎద్దులండి 
దుక్కిదున్నే ఎద్దులండి 
బలమున్న ఎద్దులండి 
బళ్ళులాగే ఎద్దులండి 
పంటలన్ని పండాలంటే 
ఎద్దులేమో ఉండాలండీ!!

కామెంట్‌లు