ఆలన-పాలన;-ఉదండ్రావు రమణబాబు;-కలం స్నేహం
తమ జీవితాలు 
తావిలేని పూల వనాలు
ఆయన చేసుకున్నాడు మేనరికం
వారిరువురి మధ్య లేదు దాపరికం
కష్టాల కడలిలో జీవితనావ నడుపుతున్నాడు తీరం చేరే మార్గం కానరాలేదు

ముత్యాల్లా ఇద్దరు ఆడపిల్లలు
వారిద్దరూ లక్ష్మీ సరస్వతులే
వారి దృష్టిలో తండ్రి మకుటం లేని మహారాజు 
తల్లి ఆ ఇంటి మహారాణి

పిల్లల భావనలో ఆ ఇల్లు ఓ అందాల హరివిల్లు
తల్లి తండ్రులకు మాత్రమే తెలుసు తాము జీవితంలో  చిన్న చిన్న ఆనందాలు కూడా కోల్పోతున్నామని
పిల్లల్లో పేదరికం భావనలు తెలియనివ్వకూడదని తల్లి తపన అందుకే ఆమె ఆటపాటలతో ముద్దు మురిపాలతో పిల్లలను లాలిస్తుంది
పిల్లల్ని పెంచడం ఓ కళ అనేది ఆమెను చూస్తే అర్థమవుతుంది

ఇంటి యజమాని జీతం కోసం పరుగులు
ఇల్లాలు జీవంలేని యంత్రం లా
ఇంట్లో పనులు
జీవితం యాంత్రికంగా మారింది
ఆరోగ్యాలకు,ఆనందాలకు దూరంగా మధ్యతరగతి బ్రతుకులు
తీరే దారే లేదా వారి వెతలు


కామెంట్‌లు
Unknown చెప్పారు…
Excellent