చేతులు కాలాక!అచ్యుతుని రాజ్యశ్రీ

 శివ బీదరికం లో మగ్గుతున్నా ఉన్నంత లో సంసారం పొదుపుగా గుట్టు గా లాక్కువస్తున్నాడు.దైవాన్ని పూజించటం ఏమాత్రం మానలేదు. పొరుగూరులో ఏమైనా కొత్త పని కాస్త నాలుగు డబ్బులు దొరుకుతాయి అనే ఆశతోబైలుదేరాడు.కాస్త దూరం నడిచేప్పటికి అలసిపోయి చెట్టుకింద మేనువాల్చాడు.ఓపామునెమ్మదిగా పాకుతూవచ్చి అతని శరీరం ని  నిమరసాగింది.కెవ్ మని అరుస్తూ లేచికూచున్న శివా దీనంగా పాముతో ఇలా అన్నాడు "ఓసర్పమా!నాకు చిన్న చిన్న పిల్లలున్నారు.నేను చస్తే వారి గతేమిటి?" పాము ఇలాఅంది"ముందు నీవు ఇంటికెళ్లి ఆవుపాలు పితికి ముంతనిండా తెచ్చి నాముందుపెట్టు."గజగజవణుకుతూ ఇల్లు చేరి భార్య పితికిపెట్టిన పాలు ఒకముంతనిండా పోసి గబగబా వచ్చి పాముముందు పెట్టాడు. "శివా!చూడు ఈముంతలో ఓబంగారునాణెం ఉంది. రోజూ నాకు ముంతనిండా పాలు తెచ్చిస్తే ఇలా రోజూ నీకు బంగారు నాణెం ఇస్తా"అందిపాము.ఆరోజు నించి దరిద్రబాధతప్పి కమ్మగాతింటూ ఆనందం గా ఉంది ఆకుటుంబం!అంతా నాగపూజచేయసాగారు. ఒక రోజు శివా యాదాద్రి యాత్ర కి బైలుదేరాడు. పెద్ద కొడుకు తో చెప్పాడు"నాయనా! నేను తిరిగి వచ్చేదాకా  రోజూ పాము కి ముంతనిండా పాలు తీసుకుని వెళ్లి అర్పించు." "అలాగే నాన్న!"అని ఆపిల్లా డు  రోజూ పాలు తీసుకుని వెళ్లి పాము ముంతలో వదిలే బంగారు నాణెం నితీసుకునివచ్చి తల్లి కి ఇచ్చాడు. మూడు రోజులు గడిచేప్పటికి వాడిపుర్రె లో చెడు ఆలోచన వచ్చింది. వినాశకాలే విపరీతబుద్ధి!ఆరోజు తనతోపాటు ఓపలుగు పట్టుకొని వెళ్లి  పాము ముంతలో పాలు తాగుతుండగా దాని తలపై బలంగా బాదాడు.వాడిఉద్దేశం ఏమంటే  పాము పొట్టనిండా బంగారు నాణాలు ఉన్నాయి కానీ పాలు తాగాలి అనే దురాశ తో పాము ఇలా రోజూ నన్ను తిప్పుతోంది.మేము కూడా తాగకుండా దీనికి ఇవ్వాల్సివస్తోంది అనే దూరాలోచనతో చేతులారా పాము ని పొట్ట ముక్కలు చేసి చూసి ఏమీ లేక పోటంతో మొహంవేలాడేసుకుని కూచున్నాడు. శివా యాత్ర ముగించి అటుగా వచ్చి  ఆదృశ్యాన్ని చూసి  విలవిలలాడాడు.మరీ తిట్టి కొడితే వాడు ఇల్లు విడిచి పోతాడేమో  ఆత్మ హత్య చేసుకుంటాడేమో అని  ఆలోచించి "మనకు చెడు కాలం దాపురించింది. నీబుద్ధి భ్రష్టు పట్టింది.చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభంలేదు అని"కొడుకు తో ఇల్లు చేరాడు.ఆరోజు నించి తలా ఒక పని చేస్తూ కుటుంబం లో ప్రతిఒక్కరికీ బాధ్యతపంచాడు.🌹
కామెంట్‌లు