ఉపాయంతో! అచ్యుతుని రాజ్యశ్రీ

 రామయ్య మంచి దయాదాక్షిణ్యాలున్న రైతు.కలలోనైనా ఒకరికి  అపకారం తలపెట్టడు.ఆరోజు పొలంకాపలాకి వెళ్తూ  లల్లాయిపాటలు పాడుతూ  ఆగుట్టప్రాంతానికి వచ్చాడు. రెండు బండరాళ్ళ మధ్య  పొడుగ్గా ఒక పెద్దపులి తోక  బైట కదుల్తూ ఉండటం చూడగానే అతని పైప్రాణం పైనే పోయింది. ఊరుఇంకా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టుపక్కల జనసంచారం లేదు. వేసవికాలంకావటంతో దూరంగా ఉన్న అడవినుంచి నీరు ఆహారం కోసం  ఈమధ్య  పులి తచ్చాడుతోందని జనం చెప్పటం విన్నాడు.తన గేదెను ఈడ్చుకెళ్లిందని భీముడు అనే రైతు లబోదిబో అన్నాడు. రామయ్య కి ఏంచేయాలో తోచలేదు.కానీ ఉపాయం తో తప్పించుకోవాలి.ఏమాత్రం అలికిడి ఐనా  పులి తనపై దూకటం ఖాయం!అందుకే దాని తోకని గట్టిగా పట్టుకొని  తన నడుము కి ఉన్న తాడు దాన్ని పెనవేస్తూఇనుపతీగను చుట్టి బలంగా గుంజిదానిపై బండరాయిని పెట్టి దానిపై కూచున్నాడు. రామయ్య అదృష్టం ఏమంటే ఆపులి ఓచిన్నసైజు జంతువుని పట్టి  పీక్కుతింటోంది.అది బాగా ముసలిది కావటంతో  దాని శక్తి  ఉడిగిపోతోందని గ్రహించాడు.తోకను గట్టిగా పట్టుకొని  లాగుతూ పెద్ద బండరాళ్ళను దాని పైపేరు స్తున్నా డు. పులి బాధతో మూల్గుతోంది.పావుగంట గడిచేప్పటికి తమ పల్లెవాడైన గూండా గిరి కనపడ్డాడు. "ఏందిరా రామిగా! ఏంటి గుండ్రాయి లాగా కూచున్నావు."పలకరించాడు."అరె గిరి బాబూ !ఇక్కడ ఓపులికూచుంది.అది దారినపోయేవారి మీద పడుతుంది అని దాని తోకని బండసందులోంచి లాగి పట్టుకున్నాను.ఇటురాకు.నీప్రాణం చాలా విలువైనది.  నీ దాదాగిరీ లేకుంటే మనజనాలు మాట వినరు.ఇక్కడ నుంచి త్వరగా పారిపో!"అన్నాడు రామయ్య. గిరి  ఎడ్డెమంటే తెడ్డెం అనేరకం."ఏందిరో బక్కపీచు రామిగా!నాకన్నా నీవు మొనగాడివా?నేను కండలవీరుడిని !నాచేతిలోని ఈగునపంని దాని నోటిలో పొడిచి చంపుతాను.నీవు లేచి పారిపో!"అని గిరి పులి ముందు నిలబడి దాని మొహంపై పలుగుతో పొడిచాడు. మొహంలోంచి రక్తం కారు తుంటే  తోక బైటికి రాక పులి గుంజసాగింది.బతికుంటే బలుసాకు బతుకు జీవుడా అని పరుగు లంకించుకొని  ప్రాణాలు దక్కించుకున్నాడు రామయ్య. అందుకే అంటారు  ఉపాయం తో అపాయాన్ని దాటివచ్చని🌹
కామెంట్‌లు