ఎం .వి .ఉమాదేవి కి జాతీయ సాహితీ పురస్కారం

 హైదరాబాద్ - అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సముద్రాల ఫౌండేషన్ వారి జాతీయ సాహితీ పురస్కారం నెల్లూరు కు చెందిన ప్రముఖ   గజల్ , కథానికలు  , ప్రక్రియల ,బాల సాహిత్య  కవయిత్రి శ్రీమతి ఎం .వి .ఉమాదేవికి లభించింది .ఇటీవల (మార్చి 8 న ) సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సముద్రాల ఫౌండేషన్ అధ్యక్షురాలు శ్రీదేవి గారి సమక్షంలో ఈ కార్యక్రమం లో తెలంగాణ ఢిల్లీ అధికార ప్రతినిధి శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి ,సినీ గేయ రచయిత శ్రీ బిక్కి కృష్ణ గారి చేతులమీదుగా ..తన అన్నగారి ద్వారా ఉమాదేవి అవార్డు సత్కారం పొందారు .ఈ సందర్బంగా పలువురు కవి మిత్రులు ఆమెకు అభినందనలు తెలిపారు .ఉమాదేవి మాట్లాడుతూ తన సాహితీ పిపాసకు ,కృషి కీ ఈ సత్కారం ఎంతో ప్రోత్సాహం ఇస్తుందని ఫౌండేషన్ వారికి ధన్యవాదములు తెలిపారు .
కామెంట్‌లు
ఇష్టపది చెప్పారు…
Congrats madam