*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౫౧ - 051)*
 *దుర్జన పద్ధతి*
తేటగీతి:
*కసవుచే నీటిచే మెద కలన చేత*
*బ్రతుకు మృగమీనసజ్జన ప్రకరమునుకు*
*శబరకైవ ర్తసూచక జనులు జగతిఁ*
*గారణము లేనిపగవారు గారె తలఁప*
*తా:*
ఈ భూమి మీద, ఆకులు, చెట్ల తీగలు తింటూ బతికే జింకలను వేటాడి తమ బ్రతుకు గడుపుకునే వారు ఒక జాతి. నీటిలో పుట్టి, నీటిలోనే పజీవించే చేపలను పట్టుకుని, అమ్ముకుని జీవనం గడిపే వారు ఇంకొకరు. వీరు ఇద్దరూ కూడా ఎవరికీ చెడు చేయకుండా తమ పద్దతులలో జీవిస్తూ వుంటారు. కానీ, వీరు కూడా ఏకారణమూ లేకుండానే ఇతరులకు శతృవులు అవుతున్నారు కదా......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*మన పని మనం చేసుకుంటూ, ఇతరులెవరినీ ఇబ్బంది పెట్టకుండా మనం జీవనాన్ని వెళ్ళదీస్తున్నా, మనతో కోరి మరీ కయ్యం పెట్టుకోవడానికి మన సమాజంలో కొంతమంది, ఒక వర్గం ఎప్పుడూ తయారు గానే వుంటారు.  ఇటువంటి వారి నుంచి ఎల్లప్పుడూ మనల్ని ఎల్లప్పుడూ ఒక కంట కనిపిఎడుతూవుండి, ప్రతి రోజూ తన నుంచి మన దృష్టి, మనసు చెదరకుండా వుండేలా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు