"ఆటవెలదులలో నీతులు";-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి:- 6300474467
 01.
ఆ.వె.
ఆహరిత్తుతోడనాటలాడగవచ్చు
ముద్దులిడగవచ్చుపెద్దపులికి
మార్చరాదుమూర్ఖమతులనునెప్పుడు
కష్టతరముబ్రహ్మకైనగాదె!!!

02.
ఆ.వె.
సత్యమార్గమందుసాధించిపనులన్ని
శాంతిబాటలోనసాగిపోయి
సాటిమనిషిపట్లసముచితమర్యాద
నందజేయవలెనుననుదినంబు!!!

03.
ఆ.వె.
కరుణహృదయశీలికర్తవ్యదీక్షతో
పరుగులిడుచునుండుధరణిపైన
అతనియనుసరించియతనితోస్నేహము
చేయఫలితమబ్బుజీవితమున!!!


కామెంట్‌లు