( ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా)
ప్రేమించుము ప్రేమించుము
పుస్తకాన్ని ప్రేమించుము
ప్రేమించిన పుస్తకం
చూపించును బుధ మార్గం
పూజించుము పూజించుము
పుస్తకాన్ని పూజించుము
పూజించిన పుస్తకం
చూపించును సంస్కారం
హత్తుకొనుము హత్తుకొనుము
పుస్తకాన్ని హత్తుకొనుము
హత్తుకొనిన పుస్తకం
అందించును ఆనందం
చదువుకొనుము చదువుకొనుము
పుస్తకాన్ని చదువుకొనుము
చదువుకొన్న పుస్తకం
తొలగించును అజ్ఞానం
రక్షించుము రక్షించుము
పుస్తకాన్ని రక్షించుము
రక్షించిన పుస్తకం
సాయపడును క్షణం క్షణం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి