ఓప్రణీతా!ప్రాణహితా!
వచ్చాయి పుష్కరాలు!
తెచ్చాయి సంబరాలు!
ఎగిసిపడే భక్తిభావతరంగాలు!
పుష్కరుని కోరిక-విరించి తీర్చే
సూక్ష్మదేహాలతో మహర్షులరాక
పుష్కరమంటే పోషించే శక్తి!
బృహస్పతి ప్రవేశం-పితృదేవతాస్మరణం!
దానధర్మాలు పాపహరణం!
పెన్‌గంగ వార్ధా వైన్గంగలతో కలసి కుమరంభీమ్ ఆసిఫాబాద్‌లో కాలుమోపి
కాళేశ్వరంలో గోదావరిలో కలిసే
ఓప్రణీతా!ప్రాణహిత!
తెలంగాణ పచ్చలహారంగా
మెరిసేవు!దాహార్తిని తీర్చేవు!
పుష్కరుడంటే పోషించువాడు
మరినీవో?ప్రాణులందరికీ హితము కూర్చేవు!
జలం లేకుంటే హాహాకారాలు!
నీవుంటేనే శక్తి బలం!
కానీ ఓవిన్నపం తల్లీ!
పాపాలు పోతాయని చేసే స్నానాలు!రోగాలు రాకుండా కాపాడు!
నదీనదాలని కాపాడాలి!
ఆ అంతరార్ధం తెలుసుకోకుండా మునకలువేస్తే
పుణ్యం మాట దేవుడెరుగు
నీరు కలుషితం!రోగాలు శాశ్వతం!
ప్రకృతిని కాపాడాలని చెప్పిన
శాస్త్రాలు తుంగలో తొక్కి
వేలంవెర్రిగా ప్రాణులకు అహితం చేయరాదని చెప్పు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి